ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ పోరుకు సర్వ సిద్ధమైంది. కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పూనమ్ యాదవ్ స్థానంలో మిను మనిని తుది జట్టులోకి తీసుకుంది. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఆడుతోంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మ్యాథ్యూస్, యస్తిక భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, వోంగ్, కౌర్, ఖాజీ, కలిత, సైకా
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె క్యాప్, తానియా భాటియా, క్యాప్సీ, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే,