అరెస్ట్ సవాల్ చేస్తూ వేసిన పిటీషన్లు వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్

అరెస్ట్ సవాల్ చేస్తూ వేసిన పిటీషన్లు వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్

తన అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఈడీ చర్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. అరెస్టును తప్పుబడుతూ.. అత్యవసర విచారణ కోరుతూ.. రెండు పిటీషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు కేజ్రీవాల్. 2024, మార్చి 22వ తేదీ శుక్రవారం.. కోర్టులో ఈ పిటీషన్లపై విచారణ చేపట్టటానికి కొంత సమయం ముందే.. ఈ రెండు పిటీషన్లను వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.

సుప్రీంకోర్టులోని పిటీషన్లను కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవటం చర్చనీయాంశం అయ్యింది. అరెస్ట్ ఎటూ జరిగిపోయింది కనుక.. అరెస్టును సవాల్ చేస్తూ పిటీషన్లు అనవసరం అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్ పిటీషన్లను మూవ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ వ్యవహారాన్ని సవాల్ చేయకుండా.. బెయిల్ పిటీషన్లు దాఖలు చేయటం ద్వారా త్వరగా బయటకు రావొచ్చనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. కేజ్రీవాల్ నిర్ణయం కీలక పరిణామంగా తెలుస్తుంది.

ALSO READ :- మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇంచార్జి భేటీ.. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్

కొన్ని నెలల క్రితం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ సమయంలో.. అరెస్టును సవాల్ చేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో బెయిల్ అనేది చాలా ఆలస్యం అయ్యిందనే చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ సైతం అలాంటి తప్పు చేయకుండా.. అరెస్ట్ ఎటూ జరిగిపోయింది కనుక.. బెయిల్ పిటీషన్లు మూవ్ చేయటం ద్వారా.. త్వరగా బయటకు రావొచ్చనే ఉద్దేశంలో ఉన్నట్లు ఢిల్లీ లాయర్ వర్గాల సమాచారం.