ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.  రెండు గంటలు విచారణ అనంతరం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా  ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు..144 సెక్షన్ విధించారు.కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆయన ఇంటి ముందుకు ఆందోళనకు దిగారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో  హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వచ్చిన 8 మంది ఈడీ అధికారులు గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ సెల్ ఫోన్లు సీజ్ చేశారు. కేజ్రీవాల్ ను రెండు గంటల పాటు విచారించారు. అనంతరం కేజ్రీవాల్ ను ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు.

లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిదిసార్లు కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీవాల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అయితే అరెస్ట్ ను ఆపలేం అని హైకోర్టు స్పష్టం చేసిన కొద్ది వ్యవధిలోనే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 

మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళన దిగారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళన దిగారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈడీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషీ తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.