దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. బీజేపీకి కేజ్రీ సవాల్

దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. బీజేపీకి కేజ్రీ సవాల్

దమ్ముంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తక్షణం ముందుకు రావాలని కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండ్రోజులగా కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ మరోసారి అసెంబ్లీలో మాట్లాడుతూ బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచనతోనే ఇప్పుడు విలీనం పేరుతో సాగదీస్తోందని ఆయన అన్నారు. ‘‘బీజేపీ చేస్తున్న డ్రామాలను దేశం సహించదు. వాళ్లు తమ పార్టీని ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చిన్న పార్టీ. అయినప్పటికీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు పెట్టేందుకు వాళ్లు భయపడతున్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ.. ఓ చిన్న పార్టీని చూసి భయపడుతోందని, ఒక వేళ బీజేపీకి దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని చాలెంజ్ చేశారు. కాగా, నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇదే రకమైన సవాల్ విసిరారు కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆప్ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

ఏపీ సీఎం జగన్‎కు నాంపల్లి కోర్టు సమన్లు

ఇంటి పన్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త పోసిన్రు