ఇంటి పన్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త పోసిన్రు

ఇంటి  పన్ను కట్టలేదని ఇంటి ముందు  చెత్త పోసిన్రు

నల్గొండ/ జగిత్యాల: ఇంటి పన్ను కట్టలేదని అధికారులు గేట్లు, తలుపులు లాక్కెల్లిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో జరిగింది. రెండేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు కోటికి పైగా పేరుకుపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సాయి బృందావనం కాలనీ, వెంకటేశ్వర కాలనీలో ఇంటి పన్ను వసూళ్ల కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కొంతమంది యజమానులు తమ ఇంటి పన్ను బకాయిలను చెల్లించారు. అయితే చాలా మంది పన్నులు చెల్లించలేదు. దీంతో పన్నులు చెల్లించని వాళ్ల ఇళ్ల తలుపులను, గేట్లను లాక్కెళ్లారు మునిసిపల్ సిబ్బంది. ఈ క్రమంలో అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పన్నులు కట్టకపోతే ఇలాంటి చర్యలే ఉంటాయని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. చివరికి పన్నులు చెల్లించి గేట్లను, తలుపులను తిరిగి తీసుకెళ్లారు స్థానికులు.

ఇదిలా ఉండగా... ఇంటి పన్ను కట్టలేదని  జగిత్యాల మున్సిపాలిటీ 28వ వార్డులోని  హైమద్ బిన్ సాలెం  ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది చెత్త వేశారు. చాలా రోజులుగా ఇంటి పన్ను కట్టకపోవటంతో చెత్త వేశామని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే మున్సిపల్ సిబ్బంది తీరుపై హైమద్ బిన్ సాలెం మండిపడ్డారు.మొదటి విడతగా రూ.25 వేలు కడతానని చెప్పినా వినకుండా చెత్త వేశారని ఆరోపించారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము చెత్త వేశామని  సిబ్బంది చెబుతున్నారు. కాగా ఈ రెండు ఘటనల్లో మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు వసూలు చేయడంలో చూపిస్తున్న ఉత్సాహం.. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో ఎందుకు లేదని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

కరెంట్ చార్జీల పెంపు దారుణం 

కశ్మీరీలకు రూమ్స్ అద్దెకివ్వమన్న హోటల్