ఢిల్లీకి తాగునీటి కష్టాలు తప్పవ్ : ఆతిశీ

ఢిల్లీకి తాగునీటి కష్టాలు తప్పవ్ : ఆతిశీ

న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)కు నిధులు విడుదల చేయకపోవడంతో, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఢిల్లీ వాటర్ మినిస్టర్ ఆతిశీ చెప్పారు. జల్ బోర్డుకు నిధుల లేమితో ఢిల్లైలో నీటి సంక్షోభం ఏర్పడే ముప్పు  ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జోక్యం చేసుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేశారు.

ఫండ్స్ రిలీజ్ చేయాలని రాతపూర్వకంగా కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రొటీన్ వర్క్స్, కార్మికులకు శాలరీలు పే చేసేందుకు కూడా నిధుల్లేవన్నారు. ఫండ్స్ ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేయడం లేదని తెలిపారు. ఇది మరికొన్ని నెలల్లో తీవ్ర నీటి ఎద్దడికి దారితీస్తుందని హెచ్చరించారు.