ప్రభుత్య ఉద్యోగులకు ఈ నెల 21 వరకు వర్క్ ఫ్రం హోం

ప్రభుత్య ఉద్యోగులకు ఈ నెల 21 వరకు వర్క్ ఫ్రం హోం

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయి చేరడంతో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని నిర్ణయిచింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కేవలం ఆన్ లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని  మంత్రి గోపాల్ రాయ్.  అంతేకాదు..ప్రభుత్య ఉద్యోగులకు ఈ నెల 21 వరకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. నిర్మాణాలు, కూల్చివేత పనులు ఈ నెల 21 వరకు ఆపేయాలని ఆదేశించారు. ఇక కాలుష్య తీవ్రత తగ్గించేందుకు 372 ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నట్టు చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మొత్తంగా 1000 ప్రైవేట్ సీఎన్జీ  బస్సులను  రెంటుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇది రేపటి(గురువారం) నుంచి  ప్రారంభం కానుందన్నారు.