పాత ఎక్సైజ్ పాలసీ పొడిగింపు : ఢిల్లీ ప్రభుత్వం

పాత ఎక్సైజ్ పాలసీ పొడిగింపు : ఢిల్లీ ప్రభుత్వం

పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. రాబోయే ఆరు నెలల్లో ఐదు డ్రై డేలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. మూడు నెలల్లో ఈ ఐదు మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బుద్ధ పూర్ణిమ, ఈద్-ఉల్-ఫితర్ మరియు ఈద్-ఉల్-జుహాలలో  లిక్కర్ అమ్మకాన్ని నిషేదించింది. త్వరలో కొత్త పాలసీని సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.   2021-22 ఎక్సైజ్ పాలసీలో  మద్యం లైసెన్సుల మంజూరులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పాత పాలసీని ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 31న రద్దు చేసింది. 

ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం పాలసీని ఉపసంహరించుకుంది. ఢిల్లీలో లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్‌ఛార్జ్ మనీష్ సిసోడియాను ఇటీవల ఈడి అరెస్టు చేసింది. ప్రస్తుతం, ఢిల్లీలో  570 రిటైల్ మద్యం దుకాణాలు, 950 హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు మద్యం అందించడానికి లైసెన్స్ కలిగి ఉన్నాయి.