Water Crisis: మానవత్వంతో నీళ్లివ్వండి..హర్యానాను కోరిన ఢిల్లీ ప్రభుత్వం 

Water Crisis: మానవత్వంతో నీళ్లివ్వండి..హర్యానాను కోరిన ఢిల్లీ ప్రభుత్వం 

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన తాగు నీటి సమస్య ఉంది. ప్రజలు తాగు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు.. మానవతా దృక్పథంతో నీళ్లివ్వాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరారు ఢిల్లీ మంత్రి అతిషీ. శుక్రవారం (జూన్ 14)  జరిగిన ఎగువ యమునా రివర్ బోర్డు సమావేశంలో ఢిల్లీకి నీటిని అందించేందుకు హిమాచల్ ప్రదేశ్ సుముఖత వ్యక్తం చేసిందన్నారు అతిషీ.

ఎగువ యమునా నీటి వాటా నుంచి 130 క్యూసెక్కుల నీరు మిగులుతోంది నీళ్లు ఇచ్చేందుకు హర్యానా ఒప్పుకుంది. అయితే రివర్ బోర్డు లెక్కల అంచనాకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని కోరింది.  దీంతోపాటు ఢిల్లీ ప్రజలకు కూడా నీటి కొరతను అర్థం చేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలని కోరింది.