‘రెడ్ లైట్ ఆన్..గాఢీ ఆఫ్‘ క్యాంపెయిన్ షురూ

‘రెడ్ లైట్ ఆన్..గాఢీ ఆఫ్‘ క్యాంపెయిన్ షురూ

వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రారంభించిన రెడ్ లైట్ ఆన్ …గాడీ ఆఫ్ క్యాంపెయిన్ ను ఇవాళ్టి నుంచి స్టార్ట్ చేశారు  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ పడినపుడు వాహనాల ఇంజిన్ ఆఫ్ చేయాలి. సిగ్నల్స్ వద్ద  ఇలా చేయడం వల్ల కాలుష్యాన్ని ఎంతో కొంత నివారించవచ్చని ఢిల్లీ ప్రభుత్వ ఆలోచన అయితే దీనిపై అవగాహన కల్పించేందుకు ..సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు  సిగ్నల్స్ వద్ద వాహనదారులకు గులాబీలు ఇచ్చి, రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ ప్రచారంలో పాల్గొని నిబంధనలను పాటించాలని అభ్యర్థించారు. తాను రెడ్ లైట్ పడినపుడు తన  కారు ఇంజిన్ను ఆపివేసానని  స్థానిక వాహనదారుడు జితు చెప్పాడు. ఇలా చేయడం వల్ల చాలా వాయు కాలుష్యం తగ్గించవచ్చన్నాడు.

ఢిల్లీలో దాదాపు కోటి వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో  రోజు 30-40 లక్షల వాహనాలు రోజు రోడ్డెక్కుతాయి. ఒక వాహనం ప్రతి రోజు  దాదాపు 10-15 నిముషాలు సిగ్నల్స్ వద్ద ఆగుతుంది. ఈ సమయంలో ఒక వాహనం ఆన్ లో ఉంచడం వల్ల 200   ml ఆయిల్ ఖర్చవుతుంది.  రెడ్ సిగ్నల్స్  పడినపుడు వాహనాలు ఆపడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడమే గాకుండా  ఏట ఒక వాహనదారుడికి రూ.7 వేల డబ్బు ఆదా అవుతుందని కేజ్రీవాల్ చెప్పారు.

జెనీలియా భర్త అనడంతో హర్ట్ అయ్యా