అకీరా నందన్ అనుమతి లేనిదే కంటెంట్ ప్రసారం వద్దు..ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

అకీరా నందన్ అనుమతి లేనిదే కంటెంట్ ప్రసారం వద్దు..ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, నటు డు పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్​కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అతని అనుమతి లేకుండా ఎటువంటి కంటెంట్ ను ప్రసారం చేయొద్దని తెలిపింది. వ్యక్తిత్వ హక్కుల రక్షణకు సంబంధించి అకీరా దాఖలు చేసిన పిటిషన్ పై ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తన అనుమతి లేకుండా డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ‘ఏఐ లవ్‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ’ సినిమాని రూపొందించారని .. ఇందులో తన ముఖం, స్వరాన్ని మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌ చేశారని అకీరా నందన్‌‌‌‌‌‌‌‌ కోర్టును ఆశ్రయించారు. 

యూట్యూబ్​లో అప్ లోడ్ చేసిన ఈ చిత్రానికి11 లక్షలకుపైగా వ్యూస్, ఇంగ్లిష్  వెర్షన్ కు 24వేలకుపైగా వ్యూస్ వచ్చాయని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ  సినిమాను నిషేధించాలని కోరారు. ఈ పిటిషన్ ను మంగళవారం జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆయన అనుమతి లేకుండా తీసిన ‘ఏఐ లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ’ సినిమాతో సహా డీప్ ఫేక్ కంటెంట్​పై  నిషేధం విధించింది. అకీరాకు సంబంధించి  సోషల్ మీడియాలో షేర్ చేసిన కంటెంట్లను తొలగించాలని ఆదేశించింది.