ఛాత్ పూజలకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

ఛాత్ పూజలకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పూర్తిగా తొలగిపోనందున  చెరువులు, నదీ తీరాలు వంటి బహిరంగ ప్రదేశాలలో చాత్ పూజ వేడుకలను నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈనెల 20 న ఛాత్ పూజ కోసం బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలకు అనుమతించవద్దని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డిడిఎంఎ) ఛైర్మన్ జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ హిమా కోహ్లీ, సుబ్రమానియం ప్రసాద్ ల ధర్మాసనం ఛాత్ పూజలపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై విచారించింది. జనం గుమిగూడడానికి అనుమతిస్తే.. కరోనా కు సూపర్ స్ప్రెడర్ గా పనిచేస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. గ్రౌండ్ రియాలిటీని పరిశీలిస్తే.. పిటిషన్ కు విచారణ అర్హత లేదని భావించాల్సి వస్తోందని పేర్కొంటూ.. పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

Read more news

మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు