శ్రద్ధ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్పై అటాక్

శ్రద్ధ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్పై అటాక్
  • అఫ్తాబ్ ను జైలుకు తరలిస్తుండగా దుండగుల దాడి 
  • పోలీసుల కాల్పులు

న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్యకేసు నిందితుడిపై హత్యాయత్నం జరిగింది. నిందితుడు అఫ్తాబ్ ను తీసుకెళ్తున్న వాహనంపై దుండగులు దాడి చేశారు. తల్వార్లతో హిందూసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. అఫ్తాబ్ ను తిహార్ జైలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. హిందూసేన కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.

వాస్తవాలను తెలుసుకునేందుకు అఫ్తాబ్ కు పోలీసులు ఇవాళ పాలిగ్రామ్ పరీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి తిరిగి తిహార్  జైలుకు తరలిస్తుండగా దుండగులు అటాక్ చేశారు. శ్రద్ధావాకర్ ను ముక్కలుగా నరికిన ఆఫ్తాబ్ ను ఉరితీయాలని హిందూసేన రైట్ వింగ్ జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా డిమాండ్ చేశారు.