బిజినెస్మెన్నని చెప్పి 24 లక్షల బిల్లు ఎగ్గొట్టాడు

బిజినెస్మెన్నని చెప్పి 24 లక్షల బిల్లు ఎగ్గొట్టాడు

ఫేక్ బిజినెస్ కార్డుతో ఓ వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించాడు. లక్షల రూపాయలు ఎగ్గొట్టి పరారయ్యాడు. యూఏఈకి చెందిన బిజినెస్ మేన్గా పరిచయం చేసుకున్న నిందితుడు మూడు నెలల పాటు హోటల్ లో గడిపి కనిపించకుండా పోయాడు. వెళ్తూ వెళ్తూ హోటల్ రూంలోని వెండి వస్తువులు ఎత్తుకుపోయాడు.

గతేడాది ఆగస్టు 1న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్కు వచ్చిన ఓ వ్యక్తి తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన బిజినెస్మెన్ మహ్మద్ షరీఫ్ గా పరిచయం చేసుకున్నాడు. ఫేక్ బిజినెస్ కార్డు, డాక్యుమెంట్స్తో చెకిన్ అయ్యాడు. అప్పటి నుంచి నవంబర్ 20 వరకు హోటల్లో బస చేసి సకల సౌకర్యాలు వాడుకున్నాడు. మూడు నెలల్లో దాదాపు 35 లక్షల వరకు బిల్లు కాగా.. మధ్యలో 11లక్షలు పే చేశాడు. చివరకు నవంబర్ 20న ఎవరికి చెప్పా పెట్టకుండా హోటల్ నుంచి పరారయ్యాడు. రూంలోని ఖరీదైన వెండి వస్తువులు ఎత్తుకుపోయాడు. విషయం తెలుసుకున్న హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.