
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసులో ఈడీ అధికారులు బుచ్చిబాబుతో పాటు ఇప్పటికే కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద ఆడిటర్‌గా పనిచేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొద్ది రోజుల క్రితం కూడా దర్యాప్తు సంస్థలు విచారించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత మార్చి 16న ఈడీ విచారణకు హాజరు కానుంది.