ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ రెండో అనుబంధ ఛార్జీషీటు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ రెండో అనుబంధ ఛార్జీషీటు

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ రెండో అనుబంధ ఛార్జీషీటును పరిగణనలోకి తీసుకుంది కోర్టు. ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22వ తేదీన హాజరుకావాలని ఐదుగురికి సమన్లు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఐదుగురు వ్యక్తులను సీబీఐ రెండో అనుబంధ ఛార్జిషీటులో నిందితులుగా పేర్కొంది.

రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చరణ్‌ప్రీత్ సింగ్‌ ను తమ చార్జ్ షీట్‌లో నిందితులుగా పేర్కొంది సీబీఐ. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ ఇప్పటివరకు మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ పాలసీ మెయిన్ కేసు కూడా ఆగస్టు 22న విచారణకు రానుంది.