గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో 23 గంటల పాటు సోదాలు

గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో 23 గంటల పాటు సోదాలు

దోమలగూడలోని సీఏ గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు ముగిశాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 5.30 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. 23 గంటల పాటు జరిపిన సోదాల్లో పలు కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌‌ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల దాడులు చేసింది. హైదరాబాద్​లోని దోమలగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్‌‌‌‌, నానక్‌‌రాంగూడ, అంబర్‌‌‌‌పేట్‌‌ డీడీ కాలనీలో తనిఖీలు కొనసాగాయి. శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో గోరంట్ల బుచ్చిబాబు ఇల్లు, ఆఫీసుపై రైడ్ చేశారు. సీఏ, ఆడిటర్‌‌‌‌గా పనిచేసిన కంపెనీల వివరాలు రికార్డ్ చేసింది. ఆయా కంపెనీల లావాదేవీలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీల్లో 14 కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కవితకు సీఏగా పనిచేసినట్లు సమాచారం. గోరంట్ల అండ్ అసోసియేట్స్‌‌ ప్రముఖ లిక్కర్, స్పిరిట్ కంపెనీలకు సీఏ, ఆడిటర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓ ప్రముఖ నేతకు చెందిన కంపెనీలకు గోరంట్ల బుచ్చిబాబు సీఏగా పనిచేసినట్లు తెసింది. ఇందులో రాబిన్ డిస్టిలరీస్‌‌ అడ్రస్ తో రిజిస్టర్‌‌‌‌అయిన అనూస్‌‌ బ్యూటీ పార్లర్‌‌ ‌‌డైరెక్టర్‌‌‌‌గా బోయినపల్లి అభిషేక్‌‌రావు ఆర్వోసీ రికార్డుల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌కు సంబంధించి ఆగస్ట్‌‌17న సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్‌‌కు చెందిన అరుణ్ రాంచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నాడు.