31 తర్వాత దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత

V6 Velugu Posted on May 28, 2021

కొద్ది రోజులుగా ఢిల్లీలో కరోనా వ్యాప్తి కేసులు తగ్గుతున్నాయి. దీంతో ఆన్ లాక్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 24 గంటల్లో 1100 కేసులు నమోదు అయ్యాయన్నారు. ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి నెలకొందని.. దశల వారీగా ఆన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్టు తెలిపారు. వారం రోజుల్లో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తివేస్తామని.. అందరి ఏకాభిప్రాయం తో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీవనోపాధి కోసం దూర ప్రాంతాల నుండి ఢిల్లీకి వచ్చిన రోజువారీ కూలీలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేజ్రీవాల్. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తామన్నారు.

Tagged CM Arvind Kejriwal, may 31, Delhi Lockdown?, lifted gradually

Latest Videos

Subscribe Now

More News