ఢిల్లీ మంత్రి అతిషిని హాస్పిటల్‌కు తరలింపు

ఢిల్లీ మంత్రి అతిషిని హాస్పిటల్‌కు తరలింపు

గత నాలుగురోజులుగా ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాకోట ఆరాష్ట్ర మంత్రి అతిషి నిరాహార దీక్ష చేస్తున్నారు. హర్యాణా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఢిల్లీ నీటి సమస్యపై ఆమె నిరాహర దీక్ష మంగళవారం ఐదవరోజుకు చేరుకుంది. ఈరోజు తెల్లవారు జామున అతిషి రక్తంలో షుగర్ లెవల్స్ క్షీణించాయి.  వెంటనే లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. అతిషి రక్తంలో షుగర్ లెవల్స్ 36కి పడిపోయిందని, ఆమెను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్చామని ఆప్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. ఆప్ మంత్రి అతిషీని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్ డైరెక్టర్ సురేశ్ కుమార్. హాస్పిటల్ కు తీసుకొచ్చినప్పుడు ఆమె బ్లడ్ షుగర్ తక్కువగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని తెలిపారు. 

కొన్నిరోజులుగా దేశ రాజధానిలో నీటిసంక్షభం ఉన్న విషయం తెలిసిందే.. అయితే బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదని, అది దేశ రాజధానిలో 28 లక్షల మందిపై ప్రభావం చూపిందని అతిషి ఆరోపించారు. ఢిల్లీకి నీరంతా పొరుగు రాష్ట్రాల నుండి వస్తుంది. హర్యానా బిజెపి ప్రభుత్వం 100 MGD లేదా 46 కోట్ల లీటర్ల కంటే ఎక్కువ నీటిని నిలుపుదల చేసిందని నిరాహార దీక్షకు దిగారు అతిషి.