దేశంలో విజృంభిస్తున్న కరోనా

దేశంలో విజృంభిస్తున్న కరోనా

ఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్‌ కేసులు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. 

  • ముంబైలో ఆదివారం కొత్తగా 19,474 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఏడుగురు మృతి చెందారు. 
  • ఢిల్లీలో గత 24 గంటల్లో 22,751 మంది కోవిడ్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 17 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 23శాతంగా ఉంది.
  • తమిళనాడులో 12,895 మందికి కరోనా నిర్థారణ అయింది. 12మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 51,335 యాక్టివ్ కేసులు ఉన్నాయి
  • త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ లో గత 24 గంటల్లో 7,695 మంది మహమ్మారి బారినపడ్డారు. గతవారంతో పోలిస్తే ఈ సంఖ్య 13 రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 
  • కేరళలో ఆదివారం 6,238మందికి వైరస్ సోకింది. కరోనా బారినపడి గత 24 గంటల్లో 30 మంది మరణించారు. ప్రస్తుతం కేరళలో 34,902 యాక్టివ్ కేసులున్నాయి.
  • కర్నాటకలో కొత్తగా 12,000 మంది కరోనా బారిన పడగా.. వారిలో 9,020 మంది బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.33శాతంగా ఉంది. 
  • రాజస్థాన్లో కొత్తగా 5,660 కరోనా కేసులు నమోదుకాగా.. ఒకరు చనిపోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 19,467 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
  • ఉత్తరాఖండ్లో 24గంటల్లో 1,413 కోవిడ్ కేసులు రాగా ఒకరు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,118

For more news..

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మీసాలు పెంచాడని ఉద్యోగం నుంచి తీసేశారు