ఢిల్లీలో కరోనా భయం..భయం

ఢిల్లీలో కరోనా భయం..భయం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అధికమౌతున్నాయి. ఆగస్టు 01 నుంచి ఈ వైరస్ బారిన పడిన వారిలో 60 శాతం మంది ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. పెరుగుతున్నా.. ఆసుపత్రుల్లో చేరికలు మాత్రం ఆగడం లేదని వెల్లడిస్తోంది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో 90 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆగస్టు 02వ తేదీన 1506 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 341 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇందులో 105 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు చనిపోయారు. ఆగస్టు 09వ తేదీన కేసుల సంఖ్య అధికమయ్యాయ్యాయి. 2 వేల 495 కేసులు నమోదు కాగా.. ఏడుగురు వైరస్ బారిన పడి చనిపోయారు.  వీరిలో 507 మంది ఆసుపత్రుల్లో చేరారు. మరో 168 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 16వ తేదీన ఢిల్లీలో 917 కేసుల నమోదైనా... ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 563గా ఉంది.

202 మంది ఐసీయూలో చేరారు. ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 19.20 శాతంగా ఉంది. ఇది 200 రోజులకన్నా అధికమని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా కేసుల నమోదవుతుండడం.. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికమౌతుండడంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు కంపల్సరి ధరించాలని ఆదేశించింది. ప్రతొక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. కోవిడ్ మహమ్మారి ఇంకా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలని, నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సూచించారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. అయితే.. కేసులు పెరుగుతున్నా.. ఎలాంటి భయం అవసరం లేదని.. కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.