క్లౌడ్ కిచెన్ ఇప్పుడు రెస్టారెంట్, హోటల్ సర్కిల్స్‌లో అధికంగా వినిపిస్తున్న పదం. కొంతమంది డార్క్ కిచెన్, ఘోస్ట్ కిచెన్ అంటుంటే ఇంకొంత మంది వర్ట్యువల్ కిచెన్స్, శాటిలైట్ కిచెన్స్ అని కూడా అంటున్నారు. పలికేది ఏ విధంగా ఉన్నా వీటన్నిటిలోనూ ఉండే ఒకే ఒక్క లక్షణం... ఎలాంటి డైన్ ఇన్ సదుపాయం లేకుండా డెలివరీ ఓన్లీ రెస్టారెంట్‌గా మెలగడమే క్లౌడ్ కిచెన్... కేవలం వ్యాపార వర్గాలకు మాత్రమే కాదు వినియోగదారులకూ వినూత్న అవకాశాలను అందిస్తుంది డెలీ 360. మీరు కోరుకోండి... మేము వండి వడ్డిస్తామంటూ ఆఫర్ చేస్తుంది.
వంటకం మీది... వంటగది మాది, పేరు మీది... మీ తరపున వినియోగదారులకు అందించేది తాము అంటూ వినూత్న నేపథ్యంతో నగరవాసుల ముంగిటకొచ్చింది డెలీ 360. క్లౌడ్ కిచెన్... కాదు కాదు అంతకు మించి అంటూ అటు బీ2బీ వినియోగదారులతో పాటుగా ఇటు బీ2సీ వినియోగదారులకూ సేవలనందిస్తుంది. 2019 నాటికి దేశంలో 5వేలకు పైగా క్లౌడ్ కిచెన్‌లు ఉన్నాయని డెలీ 360 ఫౌండర్ శివ తేజేశ్వర్ రెడ్డి అన్నారు., వినియోగదారులు తమ ఆహార ప్రాధాన్యతలకనుగుణంగా మీల్ ప్లాన్ ఎంచుకోవడమే కాకుండా, కోరుకున్న సమయానికి డెలివరీ పొందే అవకాశమూ అందిస్తున్నామంటూ డెలీ 360 యాప్ ద్వారా తాము ఈ సేవలనందిస్తున్నామన్నారు.