అదానీ పోర్ట్స్​పై  ఆడిటర్​ అభ్యంతరాలు

అదానీ పోర్ట్స్​పై  ఆడిటర్​ అభ్యంతరాలు

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్​ స్పెషల్​ ఎకనమిక్​ జోన్​ ఆడిటర్లయిన డెలాయిట్​ తమ తాజా రిపోర్టులో ముగ్గురు పార్టీలతో జరిపిన ట్రాన్సాక్షన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హిండెన్​బర్గ్​ రిపోర్టులో ఉదహరించిన ఒక కాంట్రాక్టర్​ ట్రాన్సాక్షన్​ కూడా వాటిలో ఉంది. పై ముగ్గురు పార్టీలు తమకు అన్​ రిలేటెడ్​ అని అదానీ గ్రూప్​ చెప్పిందని, తాను స్వతంత్రంగా అది నిజమో–కాదో నిర్ధారించలేదని డెలాయిట్​ హాస్కిన్స్​ అండ్​ సెల్స్​ ఎల్​ఎల్​పీ (ఆడిట్​ ఫర్మ్​) పేర్కొంది.

రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ల విషయంలో అదానీ గ్రూప్​ ట్రాన్స్​పరెన్సీ పాటించడం లేదనేది హిండెన్​బర్గ్​ ఆరోపణలలో ఒకటి. హిండెన్​బర్గ్​ ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరుగుతున్నందున, మరేవిధమైన ఎగ్జామినేషన్​ అవసరం లేదని అదానీ గ్రూప్​ అభిప్రాయపడినట్లు కూడా ఈ ఆడిట్​ ఫర్మ్​ తెలిపింది. సెబీ దర్యాప్తు పూర్తి కాకపోవడంతోపాటు, ఇతర ఎగ్జామినేషన్స్​ ఏవీ లేకపోవడంతో అదానీ గ్రూప్​ జరిపిన ట్రాన్సాక్షన్లన్నీ రూల్స్​ ప్రకారమే జరిగాయని తేల్చి చెప్పలేమని  వెల్లడించింది.