ఉద్యోగ భద్రత కల్పించాలి : సాయిబాబ

ఉద్యోగ భద్రత కల్పించాలి : సాయిబాబ

సంగారెడ్డి టౌన్, వెలుగు : దశాబ్ద కాలానికి పైగా తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి, పే స్కేల్ అమలు చేయాలని  పంచాయతీ టెక్నికల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిబాబ డిమాండ్​ చేశారు. గురువారం కలెక్టరేట్​లో సిబ్బందితో కలిసి శాంతియుత సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లకు పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని

పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్​ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన  ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని సౌకర్యాలను తమకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అలివేణి, ఉపాధ్యక్షుడు ప్రభువు,  కోశాధికారి శ్రీనివాస్ , రవి , సంతోశ్, ఈ పంచాయతీ ఆపరేటర్స్ పాల్గొన్నారు.

మెదక్ : తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ వింగ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మెదక్​ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్,  పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు  ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ ధర్నాచౌక్​ వద్ద  సమ్మె నిర్వహించారు. తమకు పే స్కేల్ అమలు చేసి ట్రెజరీ ద్వారా వేతనం చెల్లించాలని, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఈ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.