V6 News

రైళ్లను పునరుద్ధరించాలి : సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి

రైళ్లను పునరుద్ధరించాలి : సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాచలం రోడ్​ రైల్వే స్టేషన్​ నుంచి వెళ్లే రైళ్లను గతంలో రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని సౌత్​ సెంట్రల్​ రైల్వే డీఆర్​యూసీసీ మెంబర్​ వై.శ్రీనివాస్​ రెడ్డి డిమాండ్​ చేశారు. సికింద్రాబాద్​ రైల్వే సంచలన్​ భవన్​లో మంగళవారం జరిగిన డీఆర్ యూసీసీ మెంబర్స్​ మీటింగ్​లో జిల్లాలోని రైల్వే అంశాలను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. 

సౌత్​ సెంట్రల్  రైల్వే డివిజనల్​ మేనేజర్​ డాక్టర్​ ఆర్.గోపాల కృష్ణన్​కు వినతిపత్రం అందజేశారు. కొల్హాపూర్–బెల్గావి ఎక్స్​ప్రెస్, మణుగూరు–డోర్నకల్​ ప్యాసింజర్, మణుగూరు–కాజీపేట ప్యాసింజర్​ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. మణుగూరు నుంచి తిరుపతికి, మణుగూరు నుంచి షిర్డీకి ట్రైన్లను నడపాలన్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్​ పనులు స్పీడప్​ చేయాలని, గొల్లగూడెం రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని కోరారు.