ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

కరీంనగర్ టౌన్/ జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ అని, ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం కరీంనగర్​కలెక్టరేట్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని,- బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు.  

పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో  రాష్ట్రంలోనే కరీంనగర్  జిల్లా రెండో  స్థానంలో నిలిచిందన్నారు. అనంతరం  శిశుగృహలోని 4నెలల చిన్నారిని  చెన్నైకి చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పవన్ కుమార్, ఏసీపీ నరేందర్, డీడబ్ల్యూవో సరస్వతి, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ ​యాస్మిన్​బాషా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, దివాకర, ఆర్డివో నరసింహమూర్తి, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

కోరుట్ల/  జ్యోతినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ మల్యాల/ బోయినిపల్లి/ ఎల్లారెడ్డిపేట, వెలుగు :  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కోరుట్లలో కొత్త బస్టాండ్ నుంచి నంది  చౌరస్తా వరకు భారీ  ర్యాలీ నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీలోని రిటర్నింగ్​ఆఫీసులో అడిషనల్​కలెక్టర్​ఆధ్వర్యంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీనియర్​ సిటీజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సన్మానించారు.  హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఆర్డీవో రాజు  ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బోయినిపల్లి, మల్యాల, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లోనూ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు.