డెమోక్రాటిక్​ ప్రెసిడెంట్​ అభ్యర్థి రేసు.. ముందంజలో బిడెన్

డెమోక్రాటిక్​ ప్రెసిడెంట్​ అభ్యర్థి రేసు.. ముందంజలో బిడెన్

మాజీ వైస్​ ప్రెసిడెంట్​కు 395 మంది మద్ధతు
శాండర్స్ కు సపోర్ట్ చేస్తున్నది 305 మందే

వాషింగ్టన్ప్రెసిడెంట్​ ఎన్నికల్లో  పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థి కోసం డెమోక్రాటిక్​ పార్టీ నిర్వహిస్తున్న ప్రైమరీ ఎన్నికల్లో మాజీ వైస్​ ప్రెసిడెంట్​ జోయ్​ బిడెన్​ ముందంజలో ఉన్నారు. రాష్ట్రాల వారీగా జరుగుతున్న ప్రైమరీలలో మెజారిటీ చోట్ల బిడెన్ గెలుపొందారు. ప్రెసిడెంట్​ పోటీలో నిలబడాలంటే మొత్తం 3979 డెమోక్రాట్​ డెలిగేట్లలో 1991 డెలిగేట్ల ఓట్లు గెలుచుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం బిడెన్​ 395 డెలిగేట్ల మద్దతు సంపాదించుకున్నారు. ఆయన పోటీదారు, సెనేటర్​బెర్నీ శాండర్స్ కు 305 మంది మద్ధతు తెలిపారు. ప్రైమరీ రేసులో గెలుపొందిన వారు నవంబర్​ 3న జరిగే ప్రెసిడెంట్​ఎన్నికల్లో రిపబ్లికన్​ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్​డొనాల్డ్ ట్రంప్​తో పోటీపడతారు.

సూపర్​ ట్యూస్​డే హీరో బిడెన్

సూపర్​ ట్యూస్​ డే పేరుతో మంగళవారం 14 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగగా.. 1357 మంది డెలిగేట్లు ప్రెసిడెంట్​ అభ్యర్థికి ఓటేశారు. ఇందులో వర్జీనియా, నార్త్​ కరోలినా, అలబామా, ఓక్లహోమా, టెన్నెసీ, మిన్నెసోటా, మసాచుసెట్స్, అర్కన్సాస్​ రాష్ట్రాల్లో బిడెన్ గెలుపొందారు. పెద్ద సంఖ్యలో డెలిగేట్లు ఉన్న కాలిఫోర్నియాతో పాటు వెర్మాంట్, యుటా, కొలరాడో రాష్ట్రాల ప్రైమరీలలో శాండర్స్ గెలిచారు. ఈ రేసులో లేట్​గా ఎంట్రీ ఇచ్చిన న్యూయార్క్​ మాజీ మేయర్​ మైకెల్​ బ్లూంబర్గ్​ కేవలం అమెరికన్​ సమోవా కాకస్​లో మాత్రమే గెలిచారు. కాలిఫోర్నియా రేసులో శాండర్స్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఎన్నికల ప్రచారం కోసం బ్లూంబర్గ్​ భారీ మొత్తంలో ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రెసిడెంట్​ ట్రంప్​ స్పందిస్తూ.. ప్రచారం కోసం 500 మిలియన్​ డాలర్లు ఖర్చు చేసిన బ్లూంబర్గ్​ఈ నాటి బిగ్గెస్ట్​ లూజర్ అంటూ ట్వీట్​ చేశారు. ప్రెసిడెంట్​ రేసులో చివరకు తామే నిలుస్తామని, ప్రెసిడెంట్​ ఎలక్షన్​లో విజయం సాధిస్తామని బిడెన్, శాండర్స్ ఎవరికి వారే విశ్వాసం ప్రకటించారు. ఇండియన్​ సంతతికి చెందిన తులసి గబ్బార్డ్​ అమెరికన్ సమోవాలో, ప్రెస్టన్​ కులకర్ణి టెక్సాస్​ 22 డిస్ట్రిక్ట్​ ప్రైమరీలో గెలుపొందారు. కులకర్ణి గతంలో ఇండియన్​ అమెరికన్​ డిప్లొమాట్​గా పనిచేశారు.

బుష్​ మనవడి ఓటమి

హ్యూస్టన్​ కాంగ్రెషనల్​ సీట్​బరిలో నిలిచేందుకు జరిగిన ప్రైమరీలో మాజీ ప్రెసిడెంట్​ జార్జ్​ హెచ్​డబ్ల్యూ బుష్​ మనవడు పీర్స్ బుష్​ ఓడిపోయారు. పార్టీ టికెట్​ కోసం జరిగిన ఈ ఎన్నికల్లో పీర్స్ బుష్​ పోటీ చేశారు. టెక్సాస్​ నుంచి గతంలో పోటీ చేసిన బుష్​ కుటుంబ సభ్యులు ఎవరూ ఓడిపోలేదు. హ్యూస్టన్​లో  ఓటమి తర్వాత బుష్ కుటుంబంలో ఓటమిని చవిచూసిన తొలి వ్యక్తిగా పీర్స్ బుష్​ అప్రతిష్ట
మూటకట్టుకున్నారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు