మంథనిలో అక్రమ కట్టడాల కూల్చివేత

మంథనిలో అక్రమ కట్టడాల కూల్చివేత

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో 2024 మార్చి 12 మంగళవారం ఉదయం మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలను ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు, ఫుట్​పాత్​లను ఆక్రమించిన చిన్న దుకాణాలు మొదలు బడా షాపింగ్​కాంప్లెక్స్​ల వరకు వేటినీ వదలకుండా నేలమట్టం చేస్తున్నారు.

హైకోర్ట్ ఆదేశాల మేరకు మున్సిపల్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలను మొదలు పెట్టారు. తమ షాపులను కూల్చొద్దంటూ బాధితులు కన్నీరు పెడుతున్నారు. తమకు జీవనాధారమైన షాపులను తొలగిస్తే ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు  భారీగా మోహరించారు.