వేములవాడలో రాజన్న ప్రధాన ఆలయ గోదాం కూల్చివేత

వేములవాడలో రాజన్న ప్రధాన ఆలయ గోదాం కూల్చివేత

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన విస్తరణ, అభివృద్ధి పనులు స్పీడ్‌ అయ్యాయి. బుధవారం ప్రధాన దేవాలయ ఆవరణలోని గోదాంను తొలగించారు. దీంతో భక్తులకు గంటకు పైగా దర్శనాలను అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు ఆలయ ఆవరణలో రేకుల షెడ్డులను తొలగిస్తుండడంతో ఒకవైపు మాత్రమే స్వామివారి లఘు దర్శనం కల్పించారు. 

కోడె మొక్కులను భీమేశ్వర ఆలయంలో కొనసాగించారు. ఆలయ ముందుభాగంలో ప్రచార రథంలో స్వామి వార్ల దర్శనంతో పాటు ఎల్‌ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాజన్న ఆలయంలోని కళాభవన్, ఈవో ఆఫీస్​, ఎన్‌టీఆర్‌‌ గెస్ట్ హౌజ్‌లను కూల్చివేశారు. రాజన్న ఆలయంలో, భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది.