ఏపీలో మాజీమంత్రి అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత

ఏపీలో మాజీమంత్రి అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత
  • అయ్యన్నపాత్రుడు ఇంటికి భారీగా చేరుకున్న కార్యకర్తలు
  • నర్సీపట్నంలో ఉద్రిక్తత

అనకాపల్లి జిల్లా: నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. చోడవరం మినీ మహానాడులో ముఖ్యమంత్రి జగన్ పై అనుచితవ్యాఖ్యలు చేసినందుకు పలు కేసులు నమోదు చేశారు. మరోవైపు ప్రభుత్వ స్థలం అక్రమించి ఇంటిని నిర్మించారని అధికారులు నోటీసులిచ్చారు. అయ్యన్నపాత్రుడు స్పందించకపోడంతో మున్సిపల్ అధికారులు మాజీ మంత్రి ఇంటికి తరలివచ్చి జేసీబీతో ఇంటి ప్రహరి గోడను కూలగొట్టారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. కేసు విషయంలో అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు పోలీసులు. దీంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయ్యన్నపాత్రుడి ఇంటికి చేరుకున్నారు.