విద్యార్థులకు సులభమైన పద్ధతిలో బోధించాలి : డీఈవో అశోక్ కుమార్

విద్యార్థులకు సులభమైన పద్ధతిలో బోధించాలి : డీఈవో అశోక్ కుమార్

బోధన్​,వెలుగు: టీచర్లు విద్యార్థులకు సులభమైన పద్ధతిలో అర్థమయ్యే విధంగా బోధించాలని డీఈవో అశోక్​ కుమార్ సూచించారు. గురువారం బోధన్​ పట్టణంలోని రాకాసిపేట హైస్కూల్‌‌‌‌, యూపీఎస్‌‌‌‌, ప్రైమరీ స్కూళ్లలో ఎఫ్ఎల్ఎన్​(ఫండమెంట్​ లిటరసీ అండ్​ న్యూమరసీ), టీఎల్ఎం(టీచింగ్​ లెర్నింగ్​ మెటీరియల్) మండల స్థాయి మేళా నిర్వహించారు.

 ఈ సందర్భంగా విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు సాధించేందుకు టీచర్లు కృషి చేయాలని సూచించారు. అనంతరం టీచర్లు తయారు చేసిన టీఎంఎల్​ మేళాను ప్రదర్శించారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, కాంప్లెక్స్​ హెచ్‌‌‌‌ఎంలు సూర్యకుమార్, ఆరీఫ్ ఉద్దీన్ పాల్గొన్నారు.