
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని డీఈవో రాధాకిషన్ రావు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల స్కూల్లో రెండు రోజుల శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని 30 స్కూల్స్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా సైన్స్, మ్యాథ్స్ టీచర్లకు ల్యాబ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. టీచర్లు నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఆయన వెంట కోర్స్ డైరెక్టర్ సుదర్శన్ మూర్తి, ప్రిన్సిపాల్ సువర్ణలత, రిసోర్స్ పర్సన్ నవీన్, కిరణ్, టీచర్లు పాల్గొన్నారు.