ఈ ఫుడ్​తో డిప్రెషన్​ దూరం

V6 Velugu Posted on Sep 06, 2021

తినే తిండి​ పైనే ఆరోగ్యం ఆధారపడి  ఉంటుంది. కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా  ఫుడ్​ హ్యాబిట్సే డిసైడ్​ చేస్తాయి​. సంతోషం,  బాధ,  కోపం, డిప్రెషన్.. ఇలా ఎమోషన్​ ఏదైనా  సరే  తినే ఫుడ్​తోనే​ లింక్​ అయి ఉంటుంది. 

బ్రెయిన్​కి,  డైజెషన్​ ​ ట్రాక్​కి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. డైజెషన్​ ట్రాక్​లో కొన్ని బిలియన్ల సూక్ష్మ జీవులు ఉంటాయి. అవి పేగుల నుంచి బ్రెయిన్​కి మెసేజ్​ పంపించే న్యూరోట్రాన్స్​మీటర్స్​​ని తయారుచేస్తాయి.  కడుపునిండా తిన్నప్పుడు ఆ న్యూరో ట్రాన్స్​మీటర్స్​ పర్ఫెక్ట్​ షేప్​లో  ఉండి.. బ్రెయిన్​కి మెసేజ్​ పంపుతాయి. దానివల్ల  హెల్దీ బ్యాక్టీరియా రిలీజ్​ అవుతుంది. అది డోపమైన్​, సెరటోనిన్​ అనే హ్యాపీ హార్మోన్లను రిలీజ్​ చేస్తుంది. కానీ,  నూడిల్స్​, బర్గర్​ లాంటి  ఫాస్ట్​ఫుడ్స్​ తింటే న్యూరోట్రాన్స్​మీటర్స్​ షేప్​లో తేడా వస్తుంది. బ్రెయిన్​కి సరిగా మెసేజ్​ అందదు. దానివల్ల మూడ్​స్వింగ్స్​, ఏదో ఒకటి తినాలనిపించే ఆలోచనలు చుట్టుముడతాయి. కాస్త డిప్రెషన్​లో ఉన్నప్పుడు అవి​ మరింత పెరుగుతాయి. అందుకే డ్రిపెషన్​లో ఉన్నప్పుడు తినాల్సిన, తినకూడని ఫుడ్​ ఏంటో చెప్తున్నారు ఫేమస్​ న్యూట్రిషనిస్ట్​ భార్గవ్​. 
ఏమేం తినాలి?
కాస్త ముభావంగా అనిపిస్తుంటే వాల్​నట్స్​ తినాలి. వీటిల్లోని ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్​ ఫంక్షనింగ్​ని సపోర్ట్​ చేస్తాయి. డ్రిపెషన్​ సింప్టమ్స్​ని తగ్గిస్తాయి. అలాగే ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్స్​ ఎక్కువగా ఉండే అవిసె గింజలు​,  పాదరసం లేని సాల్మన్ ఫిష్, చియా సీడ్స్​ తినాలి. వీటిల్లో ఉండే ఫోలేట్, మెలటోనిన్​, విటమిన్​– ఇ, యాంటీ ఆక్సిడెంట్స్​ న్యూరోప్రొటక్టివ్​ కాంపౌండ్స్​గా పనిచేసి డిప్రెషన్​ని కంట్రోల్​ చేస్తాయి. డిప్రెషన్​లో ఉన్నప్పుడు బీన్స్​ని  డైట్​లో పక్కాగా చేర్చాలి. వీటిల్లోని జింక్, కాపర్​, మాంగనీస్, సెలీనియం, విటమిన్​– బి1, బి6, ఇ, కె లు షుగర్​ లెవల్స్​ని కంట్రోల్​ చేసి మూడ్ స్వింగ్స్​కి బ్రేక్​ వేస్తాయి. క్యాబేజీ పచ్చడి, పెరుగు, జున్ను లాంటి ప్రొ–బయోటిక్స్​ ఎక్కువగా ఉండే ఫుడ్​ తినడం వల్ల డిప్రెషన్​ నుంచి బయటపడొచ్చు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్​, ఫ్లేవనాయిడ్స్​, మెగ్నీషియం ఎక్కువగా ఉండే డార్క్​ చాక్లెట్స్​ తిన్నా మూడ్​ స్వింగ్స్​ దరిచేరవు. ఇవి మెనోపాజ్​ మూడ్​ స్వింగ్స్, ప్రి మెనుస్ట్రువల్​ సిండ్రోమ్​ని కూడా కంట్రోల్ చేస్తాయి. అన్ని రకాల కూరగాయలు, ధాన్యాల్లో  హెల్దీ కార్బోహైడ్రేట్స్​ ఉంటాయి. ఇవి  మైండ్​ని కామ్​ చేస్తాయి. వీటిల్లోని సెరటోనిన్​ అనే మూడ్​ బూస్టర్ డిప్రెషన్​ నుంచి  బయటపడేస్తుంది. పసుపులో  కొంచెం బ్లాక్​ పెప్పర్​ , ఒక టేబుల్​ స్పూన్​ కొబ్బరి నూనె​ లేదా నెయ్యి కలుపుకుని తాగినా బ్రెయిన్​ డిజార్డర్స్​ నుంచి బయటపడొచ్చు. 
ఇవి తినొద్దు
డిప్రెషన్​లో ఉన్నప్పుడు చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా వైట్​ బ్రెడ్స్​కి  దూరంగా ఉండాలి. ఇవి వెంటనే బ్లడ్​లో షుగర్​ లెవల్స్​ని పెంచుతాయి.  అలాగే కెఫిన్​ ఎక్కువగా ఉండే  కాఫీలు తాగకూడదు. ఇవి నిద్రని దూరం చేసి మూడ్​ స్వింగ్స్​ని మరింత పెంచుతాయి. డిప్రెషన్​లో ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్​  డైట్ ఫాలో అవ్వాలి. 
 

Tagged health, food, life style, depression,

Latest Videos

Subscribe Now

More News