
పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శుక్రవారం ( ఆగస్టు 22 ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో పది వేల మంది మహిళలు హాజరయ్యారు. ఈ క్రమంలో పది వేల మంది మహిళలకు శ్రావణమాస కానుకగా చీరలు పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ తరపున ఎమ్మెల్సీ నాగబాబు భార్య పద్మజ హాజరయ్యారు. ఐదు విడతలుగా జరగనున్న ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు భారీ సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు.
►ALSO READ | కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సీఐ...
సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన శ్రావణమాస కానుక అందజేశారు నాగబాబు సతీమణి పద్మజ. పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు మహిళలు. ఈ క్రమంలో ముత్తైదువులకు శ్రావణమాస వాయినాలు అందజేశారు నాగబాబు సతీమణి పద్మజ.