తుక్కుగూడ సభలో.. మంత్రి డ్రైవర్‍ని అడ్డుకున్న పోలీసులు

తుక్కుగూడ సభలో.. మంత్రి డ్రైవర్‍ని అడ్డుకున్న పోలీసులు

కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నేడు (శనివారం సాయంత్రం) జనజాతర భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయిని సభలోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్నా వినకుండా అడ్డుపడ్డారని డ్రైవర్ శ్రీనివాస్ చెబుతున్నాడు. డిప్యూటీ సీఎం వాహనమని చెప్పినా వినలేదని సభలోకి వెళ్లడానికి వాహనానికి డయాస్ పాస్ ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా శ్రీనివాస్‌పై రాచకొండ సీపీ చేయి చేసుకున్నారు.


సీపీ తీవ్ర ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డును సీపీ లాక్కున్నారు. సభ ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నిలిపివేశారు. సమస్య సద్దుమణిగి అరగంట తర్వాత తిరిగి డ్రైవన్‌ని పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో డ్రైవర్ శ్రీనివాస్‌‌ని సీపీ కొట్టించారు. డ్రైవర్‌పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ మొబైల్‌ను గుంజుకొని అతనిపై కూడా పోలీసులు దాడి చేశారు.