శాసన మండలిలో నా వంతు పాత్ర పోషిస్తా : దేశపతి శ్రీనివాస్

శాసన మండలిలో నా వంతు పాత్ర పోషిస్తా  : దేశపతి శ్రీనివాస్

శాసన మండలిలో తన వంతు పాత్ర పోషిస్తానని ప్రముఖ కవి, రచయిత, దేశపతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ స్పందించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇచ్చిన గౌరవం ఇదని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల పక్షాన తన వంతు పాత్ర పోషించానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పిన ఆయన.. శాసన మండలిలో తన వంతు పాత్ర పోషిస్తానని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన దేశపతి శ్రీనివాస్ ప్రస్తుతం సీఎంవో కార్యలయం ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు భాషా ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.