
హైదరాబాద్, వెలుగు: ప్రీమియర్ డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2023’ను వచ్చే నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని వైబ్రెంట్ ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తారు. ఇది ఇంటీరియర్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్. బీ2బీ, బీ2సీ పద్ధతుల్లో నిర్వహిస్తారు. ఏడు రాష్ట్రాలకు చెందిన స్వదేశీ భారతీయ బ్రాండ్‌లు ఇందులో పాల్గొంటాయి. అరవైకి పైగా లగ్జరీ బ్రాండ్‌లను ప్రదర్శిస్తారు.
ఫర్నిచర్, లైట్లు, కార్పెట్‌లు, సాఫ్ట్ ఫర్నిషింగ్‌లు, యాక్సెసరీలు, ఫైన్ ఆర్ట్ వంటివి కనువిందు చేస్తాయి. ఇదే వేదికపై "మ్యూజియం ఆఫ్ తెలంగాణ"ను ప్రదర్శిస్తారు. లోకల్ ట్యాలెంట్‌ను గౌరవించడం, ఇక్కడ కళల గురించి అందరికీ తెలియజేయడానికే ఈ ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణకు చెందిన డిజైనర్లు తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శిస్తారని అన్నారు.