గన్నీ బ్యాగుతో పలాజో ప్యాంటు రూ. 65,000.

గన్నీ బ్యాగుతో పలాజో ప్యాంటు రూ. 65,000.

‘వృధా అనుకున్నదేదీ పనికి రాకుండా పోదు’అని అనుకున్నారో ఏమోకానీ గోనె సంచులతో (గన్నీ బ్యాగులు) పలాజో తయారు చేశాడో డిజైనర్. దాన్ని మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. ఆ ప్యాంటు ధర  వందో రెండువందలో ఉంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆ ప్యాంటుకు ధర అక్షరాలా రూ.65,000. 

ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరుతో వింత వింత బట్టలు తయారుచేస్తున్నారు. జనాలు వాటిని అంతే ఇంట్రెస్టుతో తొడుగుతున్నారు. అయితే, హోలీ ఫ్యాషన్ అనే కంపెనీ తయారుచేసిన గోనెసంచి పలాజో ప్యాంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక బట్టల షాపులో డిస్ప్లేకు ఉంచిన ఈ పలాజోని వీడియో తీసి సచ్కద్వాహై అనే ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో అప్ లోడ్ చేశారు. దాని ధర రూ,65,000 ఉంది. అంత ధర పెట్టి గోనె సంచిని ఎవరు కొంటారనుకోకండి. చాలామంది ఈ గోనె సంచి పలాజోని ఎగబడి కొంటున్నారట.