ఖాళీగా పోలింగ్ బూత్.. ఓటెసేందుకు ఒక్కరూ రాలె

ఖాళీగా పోలింగ్ బూత్.. ఓటెసేందుకు ఒక్కరూ రాలె

ఇండియాలో దక్షిణాన ఉన్న చిట్ట చివరి పోలింగ్‌‌ కేంద్రం. గ్రేట్‌‌ నికోబార్‌‌లోని షాంపెన్‌‌ హట్‌‌లోని రెండు పోలింగ్‌‌ బూత్‌ లలో ఒకటి.అండమాన్‌‌ నికోబార్‌‌ లోక్‌‌సభ నియోజకవర్గం కిందికి వస్తుంది. దేశంలో తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్‌‌ 11న పోలింగ్‌‌ జరిగింది. అధికారులు,సిబ్బంది అన్నీ సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. ఉదయం 9దాటిం ది.. 12 గంటలైంది.. 3 కూడా దాటిపోయింది..కానీ షాంపెన్‌‌ తెగ నుంచి ఓటేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. దేశానికి దక్షిణ చివరన ఉన్నఇందిరా పాయింట్‌‌ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉందీ బూత్‌ . 2014లో కూడా ఓటేయడానికి ఇద్దరంటే ఇద్దరే వచ్చారు.ఆ తెగ వారు ఓటేయడం అదే తొలిసారి.

ఓటేయోద్దనుకున్నారేమో?

అండమాన్‌‌ నికోబార్ సెగ్మెంట్‌‌లో 31 దీవులున్నా యని అండమాన్‌‌ నికోబార్‌‌ చీఫ్‌ ఎలక్టోరల్‌‌ ఆఫీసర్‌‌ కేఆర్‌‌ మీనా చెప్పారు. ‘షాం పెన్ హట్‌‌లో రెండు బూత్‌ లు ఉన్నాయి. ఒక బూత్‌ లో 66 మంది, మరో దాంట్లో22 మంది ఓటర్లున్నారు. కఠినమైన పరిస్థితులున్నా సిబ్బంది, అధికారులు అక్కడి వెళ్లారు. కానీ ఈసారి ఒక్కరూ ఓటేయడానికి రాలేదు’ అన్నా రు. ‘షాంపెన్‌‌ తెగ దట్టమైన అడవి లోపల నివసిస్తుంటారు. నిత్యావసరాల కోసం వారినికో, 15 రోజులకోసారి షాంపెన్‌‌ హట్‌‌కు వస్తుంటారు. ఎన్నికలు ఎన్నిరో జులున్నాయో వాళ్లకు చెప్పేందుకు స్థానికులు తాళ్లకు ముడులేసుకొని బట్టలకు కట్టుకున్నారు. స్థానిక భాష, వివిధ రకాల సంతేకాలనూ వాడారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఓటు కూడా పడలేదు. స్థానికులు వారికి అర్థమయ్యే భాషలో చెప్పలేకపోయారో, లేక వాళ్లే రావొద్దనుకున్నారో ’ అని సీఈవో చెప్పారు.

అడవిలోకి వెళ్లలేం:

సీఈవోఅడవిలోకి వెళ్లి ఉండొచ్చు కదా అని ప్రశ్నించగా సుప్రీంకోర్టు తీర్పును మీనా గుర్తు చేశారు. ఆదిమ తెగకుచెందిన వారు తప్ప మిగతావారెవరూ ఆ ట్రైబల్‌‌ రిజర్వ్‌‌ ప్రాంతానికి, చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఉన్నబఫ్ఫర్‌‌ జోన్‌‌లోకి వెళ్లకూడదన్నారు. కేంద్ర గిరిజనమంత్రిత్వ శాఖ ఆంక్షలూ ఉన్నాయని చెప్పారు.‘వాళ్లొచ్చి మనతో మాట్లాడితేనే.. మనం వెళ్లి వాళ్లతోమాట్లాడటం కుదరదు’అన్నా రు. వాళ్లకు సాయం చేయడానికి తాము సిద్ధమని, కానీ ఓటేయమని ఒత్తిడిచేయలేమని చెప్పారు. దేశ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు జారవాస్‌‌, సెంటినలీస్‌‌ తెగలు ఓటేయలేదు.అండమాన్‌‌, నికోబార్‌‌ దీవుల్లో వీళ్లు కాకుండా మరోనాలుగు తెగలు అండమానీస్‌‌, ఓంజెస్‌‌, నికోబారీస్‌‌,షోంపెన్‌‌ ఉంటాయి.

రాతియుగం నాటి తెగ

గ్రేట్‌‌ నికోబార్‌‌కు చెందిన రాతియుగం నాటి ఆదిమతెగ షాంపెన్‌‌. దట్టమైన అడవుల్లో నివసిస్తుంటారు.డానిష్‌ అడ్మిరల్‌‌ స్టీన్‌‌ బిల్లీ వీళ్లను తొలిసారి 1846లోకలిశారు. బ్రిటిష్‌ అధికారి ఫ్రెడ్రిక్‌‌ అడాల్ఫ్‌‌ 1876లోఅండమాన్‌‌, నికోబార్‌‌ జాతుల భాషల గురించి వ్యా సాలు చేశారు. అయితే విదేశీ రీసెర్చర్లు దీవుల్లోకి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో తర్వాత వీళ్లగురించి చాలా తక్కువగా వెలుగులోకి వచ్చింది.తొలిసారి 2014లో వీళ్ల కోసం ఓ పోలింగ్‌‌ స్టేషన్‌‌ను ఏర్పాటు చేశారు. ఇద్దరు వచ్చి ఓటేశారు. 2001లోవీళ్ల జనాభా 300గా అధికారులు అంచనా వేశారు.2004కు సునామీకి ముందు ఇక్కడి షాంపెన్‌‌ ఏగ్రామంలో 103 మంది, బీ గ్రామంలో 106 మందిఉండేవారు. 2011లో జనాభా లెక్కల ప్రకారం ఏగ్రామంలో 10 మంది, బీలో 44 మందే ఉన్నట్లుతెలిసింది. వేట ప్రధాన వృత్తి. వేడి వాతావరణంకాబట్టి నడుము కిం ద నుంచి బట్టలు కట్టుకుం టారు.