కౌడిపల్లి, వెలుగు: పీఎం శ్రీ స్కీమ్ నిధుల దుర్వినియోగంపై మెదక్ జిల్లా కౌడిపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్హెచ్ఎం లలితా దేవిని బుధవారం స్థానికులు నిలదీశారు. పీఎం శ్రీనిధి కింద రూ.8.90 లక్షలు మంజూరు కాగా, వాటిని పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉండగా, సొంత ఖాతాలో జమ చేసుకొని, వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటారా..? ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడు నెలల కిందటే పీఎం శ్రీ నిధుల గోల్ మాల్పై నిలదీయగా, ఎంఈవో, జిల్లా అధికారులు వచ్చి నామమాత్రంగా ఎంక్వైరీ చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. టెన్త్ క్లాస్ విద్యార్థుల యాన్యువల్ డే కోసం రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ ఇన్ చార్జ్ హెచ్ఎం పద్మజ దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పాఠశాల అభివృద్ధికి వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పాలని అడిగితే, మమ్మల్ని అడిగే హక్కు లేదని, నిధులు ఖర్చు చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
