ఆస్ట్రేలియా సెనేట్​కు ఎన్నికైన దేవ్ శర్మ

ఆస్ట్రేలియా సెనేట్​కు ఎన్నికైన దేవ్ శర్మ
  • రెండోసారి పార్లమెంటుకు ఎన్నికైన భారత సంతతి వ్యక్తి

మెల్బోర్న్: భారత సంతతికి చెందిన దేవ్ శర్మ ఆస్ట్రేలియా సెనేట్‌‌కు న్యూ సౌత్ వేల్స్ నుంచి ఎన్నికయ్యారు. సెనేట్ నుంచి పదవీ విరమణ పొందిన మాజీ విదేశాంగ మంత్రి మారిస్ పేన్ స్థానంలో శర్మ పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. 2013 నుంచి 2017 వరకు ఇజ్రాయెల్‌‌లో ఆస్ట్రేలియా రాయబారి గా పనిచేసిన శర్మకు పార్టీలోని మితవాదు లు మద్దతు పలికారు. 

రిజల్ట్​ వెల్లడి తరువాత శర్మ మాట్లాడుతూ మాజీ సెనేటర్ పేన్ నుంచి బాధ్యతలు స్వీకరించడం తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. ‘‘అల్బనీస్ ప్రభుత్వం తప్పుడు చర్యలు, తప్పుడు నిర్ణయా లపై సెనేట్‌‌లో  పోరాడటానికి అవకాశం కల్పించినందుకు నేను పార్టీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న. న్యూ సౌత్ వేల్స్ లో అనేక కుటుంబాలు ఉద్యోగం, కాస్ట్ ఆఫ్​ లివింగ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా యి. 

ఈ సమస్యలపై పోరాడతా” అని అన్నారు. న్యూ సౌత్​ వేల్స్​ సెనేట్ స్థానాన్ని దక్కించుకున్నందుకు శర్మను ప్రతిపక్ష నేత డటన్ అభినందించారు. శర్మ 2019లో తొలిసారి సిడ్నీ సబర్బన్​ పార్లమెంటు సీటులో విజయం సాధించారు. ఆ తర్వాత 2022 లో జరిగిన ఎన్నికల్లో సిడ్నీ లోని వెంట్వర్త్‌‌ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.