భయానికి కొత్త పేరు ఉంటే అదే దేవర.. మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

భయానికి కొత్త పేరు ఉంటే అదే దేవర.. మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా న‌టిస్తోన్న30వ చిత్రం 'దేవ‌ర' (Devara) షూటింగ్ శ‌ర వేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవా అందాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు మేకర్స్. ఇందులో తార‌క్..జాన్వీ స‌హాకీల‌క న‌టులంతా పాల్గొంటున్నారు. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంకో 5 నెలల్లో థియేటర్లోకి రానున్నట్లు తెలిపే ఈ పోస్టర్ లో..నడి సముద్రాన ఎన్టీఆర్ చేతిలో ఆయుధం..తీరాన్ని ముద్దాడే పడవ ను చూపించారు.అలాగే..'భయానికి కొత్త పేరు ఉంటే అదే దేవర. మరో 150 రోజుల్లో విధ్వంసాన్ని థియేటర్లో చూసేందుకు సిద్ధంగా ఉండండి..అంటూ పోస్ట్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.  

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది  2024 ఏప్రిల్5న రిలీజ్ చేయనున్నారు.