థాయిలాండ్‌‌‌‌లో దేవర పాట

థాయిలాండ్‌‌‌‌లో దేవర పాట

ఎన్టీఆర్ టైటిల్ రోల్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’.  కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌‌‌‌గా కనిపించనుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం థాయిలాండ్‌‌‌‌లో ఎన్టీఆర్,  జాన్వీకపూర్ జంటపై ఓ రొమాంటిక్ డ్యూయెట్‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు.  ప్రముఖ బాలీ వుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్‌‌‌‌ దీనికి డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నా డు.  

పఠాన్, వార్, ఫైటర్ లాంటి చిత్రాలకు తను వర్క్ చేశాడు.  ‘దేవర’ చిత్రానికి వర్క్ చేయడం పట్ల ఎక్సయిట్ అవుతున్నానంటూ ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో కలిసి దిగిన  ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బోస్కో మార్టిస్.  ఎన్టీఆర్ ఎంత గొప్ప డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే.  ఇప్పుడు బాస్కో లాంటి కొరియోగ్రాఫర్ కూడా యాడ్  అవడంతో అంచనాలు మరింత పెరిగాయి. 

ప్రకాష్ రాజ్‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌, షైన్ టామ్ చాకో, న‌‌‌‌రైన్ ఇతర  ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను క‌‌‌‌ళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాక‌‌‌‌ర్‌‌‌‌, హ‌‌‌‌రికృష్ణ.కె నిర్మిస్తున్నారు.   రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌‌‌‌ థ్రిల్లర్ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న  పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.