
- కందుకూరు వాగులో దెబ్బతిన్న పైపులైన్లను పరిశీలించిన కలెక్టర్
- ఆయా గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశం
దేవరకొండ, డిండి, వెలుగు: కందుకూరు వాగులో మిషన్ భగీరథ పైప్ లైన్ లు దెబ్బతిని నీటి సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కందుకూరువాగు లో మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతిన్న స్థలాన్ని పరిశీలించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ఇంట్రా అధికారులతో నీటి సమస్యను అ డిగి తెలుసుకొన్నారు. చందంపేట డిండి మండలాల్లో 92 గ్రామాలకు నీటి సరఫరా జరిగే మిషన్ భగీరథ పైపులైన్ అని కందుకూరు వాగులో వరద ప్రవాహం తగ్గిన వెంటనే పైపులు పునరుద్ధరించాలన్నారు.
అప్పటివరకు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ట్యాంకర్లు, బోర్ల ద్వారా తాగునీటిని అందించాలని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డిని ఆదేశించారు. అంతకుముందు డిండి మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఐటీఐ కాలేజీని సందర్శించారు. డాక్టర్ హరికృష్ణను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలను సందర్శించి పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఐటిఐ కళాశాలలో సందర్శించి భవన నిర్మాణం ఫ్లోరింగ్ ను పరిశీలించి లీకేజీలు కాకుండా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆమె వెంట మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు లక్ష్మీనారాయణ మహమ్మద్ అక్తర్, నగేష్,తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.