నాకు ఓటెయ్యనోళ్లకోసం నేను పనిచెయ్య : ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్

నాకు ఓటెయ్యనోళ్లకోసం నేను పనిచెయ్య : ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్
  • ముస్లిం, యాదవులనుద్దేశించి జేడీయూ ఎంపీ వివాదాస్పద కామెంట్లు

పాట్నా: తనకు ఓటు వేయని వాళ్లకోసం పని చేయబోనని బిహార్​కు చెందిన జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్ అన్నారు. సీతామర్హి నుంచి ఎంపీగా గెలిచిన ఠాకూర్.. ఓ సమా వేశంలో మాట్లాడుతూ ముస్లిం, యాదవులపై తన అసంతృప్తిని బయటపెట్టారు. లోక్​సభ ఎన్ని కల్లో తనకు ఓటు వేయనందున ముస్లిం, యాదవ  వర్గాల ప్రజలు ఎలాంటి వినతిపత్రాలు ఇచ్చినా తీసుకోనని అన్నారు. 

 నా దగ్గరికి రావాలనుకునే ముస్లిం, యాదవులు వచ్చి స్నాక్స్ తీసుకోవచ్చు. చాయ్ తాగి వెళ్లొచ్చు. కానీ, ఎలాంటి సాయం అడగవద్దు” అని ఆయన అన్నారు. ‘‘ఈమధ్య ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒకతను ఏదో పనిమీద నా దగ్గరికి వచ్చిండు. ఆర్జేడీకి ఓటేశారా అని నేనతడిని అడిగిన. అతడి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతే, టీ తాగి వెళ్లిపొమ్మని చెప్పిన”అని ఠాకూర్ సమావేశంలో వివరించారు. బీజేపీతో పొత్తు కారణంగా ఆ రెండు వర్గాలను తనకు ఓటేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయింది.