
మాస్ సాంగ్స్ విషయంలో ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తుంటారు దేవిశ్రీ ప్రసాద్. మరోసారి ఆయన తన మార్క్ పాటతో ఆకట్టుకున్నారు. ‘వైరల్ వయ్యారి’ అంటూ సాగే ఈ పాటను ‘జూనియర్’ సినిమా కోసం కంపోజ్ చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా శ్రీలీల హీరోయిన్. రాధాకృష్ణ దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రంలో పాటను విడుదల చేశారు.
‘‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబునే.. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగ్.. చూశావంటే బైండ్ బ్లోయింగ్.. నేనేమీ చేసినా ఫుల్ ట్రెండింగు..’’ అంటూ ప్రస్తుత సోషల్ మీడియా పోకడల గురించి కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. క్యాచీ ట్యూన్‌తో కంపోజ్‌చేయడంతో పాటు హరిప్రియతో కలిసి పాడారు దేవిశ్రీ ప్రసాద్. మరోసారి తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ మాస్ నంబర్‌లో సత్తా చాటింది శ్రీలీల. తనను మ్యాచ్ చేస్తూ కిరీటీ గ్రేస్‌ఫుల్‌గా వేసిన స్టెప్పులు ఇంప్రెస్ చేశాయి. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది.