CSK vs PBKS : కాన్వే కమాల్.. పంజాబ్కు భారీ టార్గెట్

CSK vs PBKS : కాన్వే కమాల్.. పంజాబ్కు భారీ టార్గెట్

సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను చితకబాదారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (37, 31 బంతుల్లో), కాన్వే (92, 52 బంతుల్లో) పవర్ ప్లేలో రెచ్చిపోయారు. 

దాంతో చెన్నై భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన శివమ్ డూబె (28, 17 బంతుల్లో) పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు. చివర్లో ధోనీ తనదైన స్టైల్ లో రెండు సిక్సర్లు బాధి స్కోర్ ను 200కు చేర్చాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, సామ్ కర్రన్, రాహుల్ చాహర్, శిఖందర్ రజా చెరో వికెట్ తీసుకున్నారు.