తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. పరీక్షలు పూర్తి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. 

నిన్న(మార్చి 31) తిరుమలకు 81,224 మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 24,093  మంది భక్తులు తలనీలలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 

ఈరోజు(ఏప్రిల్ 1) తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శనం 24 గంటల సమయం పడుతుంది.