మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు

తాడ్వాయి, వెలుగు : వేసవి సెలవులు ముగుస్తుండడంతో మేడారం అమ్మవార్ల దర్శనానికి ఆదివారం (జూన్ 07) భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగు వద్ద తలనీలాలు సమర్పించిన అనంతరం వాగులో స్నానాలు చేశారు. తర్వాత ఎత్తు బంగారం తీసుకొని అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు,చీర సారే సమర్పించారు. 

తర్వాత మేకలను, కోళ్లను బలిచ్చి.. కుటుంబసభ్యులతో కలిసి విందు చేసుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్సై కమలాకర్‌‌‌‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.