ఎడపల్లి, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గల అష్టముఖీ కోనేటి స్నానానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం అమావాస్య రోజున ఇక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దీంతో శనివారం అమవాస్య కావడంతో అష్టముఖి స్నానానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వ సలహదారు సుదర్శన్‌రెడ్డి సైతం స్వామిని దర్శించుకున్నారు.
శనీశ్వరుడి దర్శనానికి భక్తుల బారులు
ఆదిలాబాద్ టౌన్: శని అమావాస్యను పురస్కరించుకొని శనీశ్వరుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదిలాబాద్‌లోని వినాయక్‌చౌక్ ఆలయం వద్ద దర్శనానికి బారులు తీరారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే ఆలయానికి వస్తూ శనీశ్వరుడి విగ్రహానికి నూనెతో అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా భక్తులు రావడంతో కిలోమీటరు మేర క్యూలైన్ఏర్పడింది.
